డార్లింగ్ ప్ర‌భాస్ అరిపించాడుగా ..!

డార్లింగ్ ప్ర‌భాస్ అరిపించాడుగా ..!

0

బాహుబలి కి ముందు ప్రభాస్ కేవలం టాలీవుడ్ హీరో, బాహుబలి రెండు పార్ట్శ్ తరువాత ప్రభాస్ ఒక్కసారిగా ఇండియన్ స్టార్ హీరో అయ్యాడు. అయితే అంతే భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ‘సాహో` ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. కానీ ఇతర వర్షన్ లో మాత్రం క‌లెక్ష‌న్‌ల ప‌రంగా స‌రికొత్త రికార్డుల్ని నెల‌కొల్పింది.సాహో తరువాత చేస్తున్న సినిమా గురించి ఈ గురువారం ప్రభాస్‌ కొత్త సినిమా యూనిట్ చేసిన ప్రకటన అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.

ప్ర‌భాస్ న‌టిస్తున్న 20వ చిత్రం `జాన్‌`. వ‌ర్కింగ్ టైటిల్‌గా ఈ పేరు వినిపిస్తోంది.`జిల్` ఫేమ్‌ రాధాకృష్ణ‌కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా లో ప్రభాస్ జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా ను పిరియాడిక్ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ శ‌నివారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది.

ఈ సంక్రాంతికి ప్రభాస్ ఏదైనా గిఫ్ట్ ఇస్తాడనుకుంటే నిరాశ పరిచాడు. దీంతో లేట్‌గా అయినా.. లెటేస్ట్‌గా సంక్రాంతి బహుమతి ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు డార్లింగ్ . పురాతమైన పెద్ద హాల్‌లో పియానో పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేసాడు. ఈ ఫోటోను డార్లింగ్ ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here