అల `వైకుంఠపురము` ఎవరిదో తెలుసా? ఎన్ని కోట్లతో కట్టారో తెలిస్తే షాకే..!

అల `వైకుంఠపురము` ఎవరిదో తెలుసా? ఎన్ని కోట్లతో కట్టారో తెలిస్తే షాకే..!

0

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలసి చేసిన హ్యాట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురం లో’ ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డు కలెక్షన్స్ లో దూసుకుపోతూ నిర్మాతలకి,డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల వర్షం కురిపిస్తు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా టైటిల్‌లో వైకుంఠపురము అనేది ఓ ఇంటికి పెట్టుకున్న పేరు. మల్టీ మిలియనీర్‌ అయిన సచిన్‌ కేడ్కర్‌ ఆయన కూతురు టబు, అల్లుడు జయరామ్‌ ఇతర కుటుంబ సభ్యులు నివసించే విలాసవంతమైన భవంతి వైకుంఠపురము. సినిమాకు ఈ ఇల్లు ఎంతో కీలకం కావటంతో అంత గొప్పగా కనిపించే ఇంటి కోసం చిత్ర దర్శక నిర్మాతలు చాలా కాలం వెతికారట.

అయితే ఈ ఇల్లు ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన NTV చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచన చౌదరి గారి భర్త వాళ్ళది…తన పేరు విష్ణు తేజ …సుమారు 200 కోట్లతో కట్టిన ఇల్లు ఇది, నరేంద్ర చౌదరి ,హారిక హాసిని అధినేతలకు కూడా బంధువులే. ఆ బంధుత్వంతో ఒకటి రెండు రోజులు బయట నుంచి షూట్ చేయడానికి, సినిమాలో ఆ బంగ్లా చూపించడానికి అనుమతి దొరకింది.అలా 20 రోజుల పాటు ఆ ఇంటి పరిసరాల్లో షూటింగ్ చేశారు.

గతం లో కూడా త్రివిక్రమ్-పవన్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా కి అందమైన ఇంటి కోసం చిత్ర దర్శక నిర్మాతలు చాలా కాలం వెతికారట.కానీ సెట్ కాకా రామోజీ ఫిలిం సిటీ లో చేసారు భారీగా ఒక సెట్ నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here