మూడో టీ 20 లో ‘సూపర్ ఓవర్’ లో రోహిత్ ‘సూపర్ సిక్స్’ లు ..కోహ్లీ సేన సూపర్ విక్టరీ..!

మూడో టీ 20 లో సూపర్ ఓవర్ లో రోహిత్ శర్మ విశ్వ రూపం .. కోహ్లీ సేన సూపర్ విక్టరీ..

0

చివరి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మూడవ టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.ఇండియా వర్షన్ న్యూజిలాండ్ ఐదు టీ 20 సిరీస్ లో భాగంగా ఇండియా వరుసగా 2 మ్యాచ్ లు గెలిసిన సంగతి తెలిసిందే. ఈ రోజు హామిల్టన్ లో సాగిన మూడవ టీ20 మ్యాచు టైగా ముగిసిన సంగతి తెలిసిందే.మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి 180 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచింది.

ఇదిలా ఉంటే టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్వానించింది. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌లు (27 )చక్కటి శుభారంభాన్ని అందించారు. రోహిత్‌(65) వీరవిహారం చేస్తూ రెచ్చిపోయాడు.

180 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 179/5 పరుగులు చేసింది. చివరి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మూడవ టీ20 మ్యాచు టైగా ముగిసింది. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లారు.

సూపర్ ఓవర్‌లో కివీస్ 17పరుగులు చేసింది…సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న రెండు బంతులనూ సిక్సర్లుగా మలిచిన రోహిత్ జట్టుకు అద్భుత విజయాన్నందించాడు.ఇక రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో సిక్స్ ..ఫోరులతో చెలరేగి 23 బంతులలో హాఫ్ సెంచరీ చేసాడు.T20 మ్యాచ్ లలో అతి తక్కువ బంతులలో రోహిత్ కి నాలుగోవ హాఫ్ సెంచరీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here