హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ గురించి నమ్మలేని నిజాలు..!

హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ గురించి నమ్మలేని నిజాలు..!

0

హీరో శ్రీకాంత్ గారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యామిలీ హీరోగా తనదైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీ కాంత్ నాన్న మేక పరమేశ్వరరావు, అమ్మ ఝాన్సీ . శ్రీకాంత్ కి అన్న..చెల్లెలు ఉంది.

మేకవారి పాలెం శ్రీకాంత్ స్వస్థలం. కానీ కొన్నేళ్ళకి శ్రీకాంత్ నాన్న పరమేశ్వర రావు కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లారు. శ్రీకాంత్ కూడా గంగావతి లో జన్మించారు. అక్కడే బీకాం వరకు చదువుకున్న శ్రీకాంత్ సినిమా అంటే మక్కువ తో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిప్లమా చేశారు.

పీపుల్స్ ఎన్కౌంటర్ అనే చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ సురేష్ ప్రొడక్షన్ లో తాజ్ మహల్ చిత్రంతో హీరోగా మారిపోయారు ఇక ఆ తర్వాత తన కెరియర్లో వెనుదిరిగి చూడలేదు.ఇక ఈ మధ్య కాలం లో శ్రీకాంత్ కి హీరో గా అవకాశాలు ఎక్కువ రాలేదు విలన్..మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు..

ఆమె చిత్రంలో తనతో పాటు నటించిన ఊహాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీకాంత్. వీరికి ముగ్గురు పిల్లలు. రోషన్, మేద, రోహన్. తన కెరీర్ లో కానీ పర్సనల్ విషయాల్లో గానీ తన తండ్రి పరమేశ్వర రావు గారు చాలా సపోర్టు అందించాలని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శ్రీకాంత్.

అంత సపోర్ట్ ఇచ్చిన ఆయన అనారోగ్యం కారణంగా ఇటీవలే మరణించారు. ఆయన మరణంతో శ్రీకాంత్ గారి కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం హీరో శ్రీకాంత్ కొన్ని వెబ్ సిరీస్ లలో చేస్తున్నాడు..అంతేకాకుండా శ్రీ కాంత్ బాలక్రిష్ణ మూవీ లో విలన్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here