నా రేటు పెంచలేదు..నాకు ఎంత ఇవ్వాలో నా దగ్గరికి వచ్చే వారికీ తెలుసు..!

నా రేటు పెంచలేదు..నాకు ఎంత ఇవ్వాలో నా దగ్గరికి వచ్చే వారికీ తెలుసు..!

0

కన్నడ భామ నభా నటేశ్ తెలుగు లో సుధీర్ బాబు తో నన్ను దోచుకుందువటే సినిమా తో తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన బొద్దు గుమ్మలలో నభా నటేశ్ ఒకరు..ఆ తరువాత పూరి-రామ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ లో వరంగల్ పోరిగా తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత ఈ భామ రవి తేజ ‘డిస్కోరాజా’ లో నటించగా ఈ సినిమా నిరాశపరిచింది. త్వరలో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది..అయితే తాజాగా ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో..పారితోషికానికి సంబంధించిన విషయాన్ని గురించిన ప్రస్తావన రావడంతో తనదైన శైలిలో స్పందించింది ఈ భామ..

సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి నేను పారితోషికం పెంచేసినట్టుగా..నిర్మాతలను గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.ఇందులో ఎంతమాత్రం నిజంలేదు. నాకున్న క్రేజ్ కి ఎంత తీసుకోవాలో నాకు తెలుసు .ఎంత ఇవ్వాలనేది నిర్మాతలకు తెలుసు.ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

పారితోషికాన్ని డిమాండ్ చేసే స్థాయికి నేను ఇంకా రాలేదు. పారితోషికం ఎక్కువ అడిగేసి నిర్మాతలను ఇబ్బంది పెట్టను..అలాగని చెప్పేసి తక్కువ ఇస్తామంటే మాత్రం ఒప్పుకోను”అంటూ తేల్చి చెప్పేసింది.తన ఇమేజ్ కు తగ్గ పారితోషికం ఇస్తే బ్యానర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తానని తెలివి గానే చెప్పేసింది ఈ పొట్టి సుందరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here