ఆ ముగ్గురి ఏపీ బీజేపీ ఎంపీల అలకకు కారణం ఆయనేనా..!

ఆ ముగ్గురి ఏపీ బీజేపీ ఎంపీల అలకకు కారణం ఆయనేనా..!

0

విజయవాడ లో మొన్న జరిగిన బీజేపీ ముఖ్య నేతల సమావేశానికి ముగ్గురు నేతలు హాజరు కాలేదు. సుజనా చౌదరి..టీజీ వెంకటేష్..సీఎం రమేష్ నాయుడు లు సమావేశానికి హాజరు కాలేదు.అయితే అన్ని సమావేశాలకు అందరు హాజరుకారు. తాజాగా నిన్న జరిగిన సమావేశానికి ఆ ముగ్గురు నేతలు హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది..

కేంద్ర బడ్జెట్ పై పార్టీ అధ్యకుడు తో జిల్లలోని ముఖ్య నేతలకు అవగాహనా కోసం పార్టీ ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది..అలాంటి మీటింగ్ కి రాకపోవడమే చర్చ కు దారితీసింది.ఏపీ బీజేపీ లో టీవల జరిగిన పరిణామాలే ఈ ముగ్గురు ఎంపీ లు అలిగారరని కామెంట్స్ వినిపిస్తున్నాయి..అందుకే సమావేశాలకు రాలేదని..అంతేకాకుండా మరో ఎంపీ GVL నరసింహ కారణమని మరి కొందరి వాదన..

రాజధాని విషయం లో మేము ఒక్కటి మాట్లాడుతుంటే GVL మాత్రం మాకు వ్యతిరేకంగా..వైసీపీ పార్టీ కి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఈ ముగ్గురు నేతలు భావిస్తున్నారటా..అంతేకాకుండా ఏపీ రాజధాని పై సుజనా చౌదరి దూకుడు విషయం పై పార్టీ పెద్దలు హెచ్చరికలు చేశారంటా..రాజధాని విషయం లో సుజనా..కన్నా ఒకటి చెబుతుంటే వారికీ భిన్నంగా మరొకటి చెబుతున్నారటా.

ఇలా జరుగుతున్న పరిణామాల పై సుజనా అసంపూర్తిగా ఉన్నారని తెలుస్తుంది.ఎంపీ GVL తీరు పై పార్టీ లో మరి కొందరు అసంపూర్తిగా ఉన్నారటా..ఇక బీజేపీ లోని మరికొందరు GVL కు మద్దతుగా ఇస్తూ ..పార్టీ ఆదేశాల మేరకు అయన మాట్లాడుతున్నారని అంటున్నారు..అయితే GVL మాటలు అప్పుడప్పుడు వైసీపీ కి అనుకూలంగా ఉన్న బీజేపీ పెద్దల సూచన మేరకే మాట్లాడుతున్నారని అంటున్నారు.

ఈ పరిణామాలతో టీడీపీ నుండి బీజేపీ లోకి వచ్చిన ఎంపీ లు ఆసంపూర్తిగా ఉన్నారని తెలుస్తుంది.అందులో భాగంగానే ఆ ముగ్గురు పార్టీ మీటింగ్ కి డుమ్మా కొట్టారని తెలుస్తుంది.ఇక సీఎం రమేష్ ఇంట్లో పనుల వలన రాలేదని..కానీ కడప జిల్లాలో జరిగిన మీటింగ్ కి డుమ్మా కొట్టడం తో అనుమానాలు ఎక్కువయ్యాయి.మరి పార్టీ పెద్దలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here