ఎంపీ సుజనా చౌదరికి షాక్..రూ.400కోట్లు విలువైన ఆస్తులు .. మర్చి 23 న వేలం..!

ఎంపీ సుజనా చౌదరికి షాక్..రూ.400కోట్లు విలువైన ఆస్తులు . .మర్చి 23 న వేలం..!

0

బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి భారీ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించి రూ.400 కోట్ల విలువైన ఆస్తుల వేలానికి సంబంధించి ప్రకటన జారీ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన చెన్నై కార్పొరేట్ బ్రాంచ్ ఈ నోటీసులు జారీ చేసింది.

మార్చి 23, 2020న ఈ వేలం పాట జరగనుంది. మొత్తం రూ.400 కోట్ల 84లక్షల 35వేల బకాయి ఉన్నట్టు తెలిపింది. తీసుకున్న రుణ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు బ్యాంక్ నోటీసుల్లో తెలిపింది. రుణం జమానతు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు బ్యాంకు అఫ్ ఇండియా చెబుతోంది.

సుజనా యూనివర్సల్ ఇండ్రస్ట్రీ పేరిట తీసుకున్న రుణాలను చెల్లించక పోవడం, నోటీసులకు సమాధానం ఇవ్వక పోవడంతో ఇండియన్ బ్యాంకు సుజనా చౌదరి ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.సుజనా యూనివర్సల్ కంపెనీ సుజనా చౌదరికి చెందినది.

ఆ సంస్థ తీసుకున్న బ్యాంక్ లోన్లకు గ్యారెంటీ సంతకాలు పెట్టిన వారు అంటూ సుజనా చౌదరి, వై.శివలింగ ప్రసాద్ (లేట్), వై.జితిన్ కుమార్, వై.శివరామకృష్ణ. ఎస్టీ ప్రసాద్, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, సుజనా కేపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్, నియోన్ టవర్స్, సార్క్ నెట్ లిమిటెడ్ సంస్తల పేర్లను బ్యాంక్ ప్రకటించింది.మరోవైపు ఈ నోటీసుల వ్యవహారంపై సుజనా చౌదరి స్పందించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here