కియారా ఐదేళ్ల లో ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్ అవుతారు..!

కియారా ఐదేళ్ల లో ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్ అవుతారు..!

0

బాలీవుడ్‌లో భారత మాజీ క్రికెటర్ ‘ఎం.ఎస్.దోని’ జీవిత కథపై తెరకెక్కించిన ‘ఎం.ఎస్.దోని చిత్రం తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తరువాత తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆతర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.

ఆ చిత్రం తర్వాత కియారా తన దృష్టిని కేవలం హిందీ సినిమాలకే పరిమితం చేసింది. గతేడాది షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో జెండా పాతింది. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు వేడి పుట్టిస్తూ యాక్టివ్‌గా ఉంటోంది కియారా. అప్పట్లో ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించింది.దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది.

కబీర్ సింగ్ హిట్ తో వరుసగా ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది.అయితే ఈ బ్యూటీ ఎంత బిజీగా ఉందంటే, గత 5 ఏళ్లలో ఈ చిన్నది ఏకంగా రూ.30 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది.కేవలం సినిమాల్లోనే కాకుండా పలు యాడ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న కియారా మిగతా హీరోయిన్లు కుళ్లుకునేలా చేస్తోంది.

ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో కాంచన’ మూవీకి రీమేక్‌ లక్ష్మీబాంబ్‌’ అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది.ఆ తరువాత ఫీమేల్ ఓరియెంటెడ్ ‘ఇందూ కీ జవానీ’ అనే మరో చిత్రం లోనూ ఆమె నటిస్తోంది.ఇదే ఆమెకు ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా . అంతేకూండా వెబ్ సీరీస్‌లతో కూడా దూసుకెళుతున్న కియారాను చూసి ఔరా అంటున్నారు ప్రేక్షకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here