హైదరాబాద్‌లోని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ 56 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయబడనున్నాయి. మార్చి 15 నుంచి దరఖాస్తులు ప్రారంభమై, ఏప్రిల్ 5, 2025 లోపు అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
పోస్టుల వివరణ:
- స్టెనోగ్రాఫర్-గ్రేడ్-2: 02 పోస్టులు
- ట్యాక్స్ అసిస్టెంట్: 28 పోస్టులు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 26 పోస్టులు
అర్హతలు:
- స్టెనోగ్రాఫర్: 12వ తరగతి ఉత్తీర్ణత
- ట్యాక్స్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 10వ తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాలు
స్పోర్ట్స్ విభాగాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్, స్నూకర్స్, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జి, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా పరీక్షలు లేకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి వివరాలు, అర్హతలు, మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అప్లికేషన్ విధానం:
ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపాలి. దరఖాస్తు సమర్పించేప్పుడు వయసును నిర్ధారించే మెట్రిక్యులేషన్/ ఎస్ఎస్సీ లేదా సమాన సర్టిఫికేట్, విద్యార్హత సర్టిఫికెట్లు, క్రీడలలో సాధించిన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
చివరి తేదీ: 2025 ఏప్రిల్ 5.
మరిన్ని వివరాల కోసం: అధికారిక వెబ్‌సైట్ incometaxhyderabad.gov.in ను సందర్శించండి.