entertainment photos

బాడీగార్డ్‌కు నెలకు రూ.10 లక్షలు జీతం.. ఆ స్టార్ హీరోయిన్ రేంజే వేరు…

దక్షిణ భారతదేశంలో పుట్టి, బాలీవుడ్‌లో పాగా వేసింది ఈ హీరోయిన్. ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకుని.. తన అందం, తెలివితేటలు, నటనతో కోట్లాది మంది గెలుచుకున్న నటిమణులలో ఒకరు. స్టార్ హీరో ఫ్యామిలీకి కోడలుగా వెళ్లిన ఆ హీరోయిన్.. కోట్లాది మంది హృదయాలను గెల్చుకున్నారు. మనం మాట్లాడుకునేది ప్రముఖ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ గురించి. ఐశ్వర్యరాయ్ నవంబర్ 1973లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. సంప్రదాయ దక్షిణ భారత కుటుంబంలో పెరిగింది. ఆమె 2007లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుంది.అభిషేక్, ఐశ్వర్యకి 2011లో ఆరాధ్య మొదటి బిడ్డ జన్మించింది. ఐశ్వర్యరాయ్ తన బాడీగార్డుకు ఇచ్చే జీతం గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతులైన నటిమణుల్లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఒకరు. అయితే ఈ సుందరి తన బాడీగార్డు శివరాజ్‌కు ఏకంగా కోటి రూపాయల జీతం ఇస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెలకు రూ.7-10లక్షల జీతం ఇస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Skip to content