ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల!
2025 ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుండి 20 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు రోజూ రెండు సెషన్లలో నిర్వహించబడతాయి. ఉదయ సెషన్: ఉదయం 9:00 నుండి 12:00 గంటల వరకు, మధ్యాహ్న సెషన్: మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు నిర్వహించబడుతుంది.
ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుండి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు.
సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు తమ ఫీజు ఏప్రిల్ 15 నుండి 22 మధ్యలో చెల్లించాలి. ఇక రాసిన పేపర్లను రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకునే వారు ఏప్రిల్ 13 నుండి 22 మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.