ముంబైలో జోష్‌తో మొదలైన వేవ్స్ సమ్మిట్ (World Audio Visual & Entertainment Summit) సినీ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌ను ఘనంగా ప్రారంభించగా, దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖులు రజనీకాంత్, మోహన్‌లాల్, హేమ మాలిని, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తితో కలిసి దిగిన గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ఒకేసారి అలనాటి లెజెండ్స్ ఇలా ఒక్కచోట కనిపించడం చూసినదే లేదు” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
“కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్” అనే థీమ్‌తో సాగుతున్న ఈ సమ్మిట్‌లో సినీ, టీవీ, గేమింగ్, మ్యూజిక్ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, రణ్‌బీర్ కపూర్, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ కూడా ఈ వేడుకలో మెరిశారు.
చిరంజీవి ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా బుధవారం ముంబై చేరుకున్నారు. ఆయన లుక్, ప్రెజెన్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఈ సమ్మిట్ భారతీయ సినీ రంగ ప్రస్థానానికి మరో గుర్తింపు చేకూర్చే దిశగా సాగుతోంది.