ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తమ 6.5 కోట్ల చందాదారులకు శుభవార్త ప్రకటించింది. ప్రస్తుతం చందాదారులకు ఇచ్చే వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతుంటుంది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి మార్కెట్ పతనాలు ఉన్నా కూడా వారికి స్థిరమైన వడ్డీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కొత్త వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ నిధిని సృష్టించడంపై ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది.
ఈ కొత్త నిధితో చందాదారులకు ప్రతి ఏడాది ఒకే స్థిరమైన వడ్డీ అందించడం సాధ్యపడనుంది. ఉదాహరణకు, మార్కెట్ తిరుగులేని పరిస్థితుల్లో ఉంటే, EPFO దాని ఆదాయాన్ని దాచే ఈ ఫండ్ నుంచి డబ్బు తీసుకొని చందాదారులకు వడ్డీని అందించనుంది. ఇది చందాదారులకు ఎప్పటికీ స్థిరమైన వడ్డీని నిర్ధారిస్తుంది.
వడ్డీ రేట్ల చరిత్ర
ఈపీఎఫ్‌వో 1952-53లో 3% వడ్డీ రేటుతో ప్రారంభమైంది. 1989-90లో ఇది 12%కి చేరింది. 2001-02లో 9.5%కి తగ్గి 2005-06లో 8.5%కి పడిపోయింది. తరువాత, 2010-11లో 9.5%కి పెరిగి 2011-12లో మరింతగా 8.25%కి తగ్గింది. 2021-22లో మాత్రం 8.1%కి చేరుకుంది. ఈ కొత్త రిజర్వ్ ఫండ్ ద్వారా ఈ వడ్డీ రేట్లలో మార్పులు వచ్చే అవకాశం లేకుండా వడ్డీ స్థిరంగా ఉండేలా చూసే చర్యలు తీసుకుంటున్నారు.
నూతన విధానం:
ప్రస్తుతం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ కొత్త పథకంపై అధ్యయనం చేస్తోంది. ఈ నిధి ఎలా పని చేస్తుందో, దాంట్లో ఎంత డబ్బు జమ చేస్తారో వంటి వివరాలు త్వరలోనే వెలుగులోకి రాబోతున్నాయి.