ఇరవై ఏళ్ల సినీ ప్రయాణం… ఇంకా అదే ఎనర్జీ, అదే ఫైర్!
తాజాగా “ఓదెల 2” ప్రమోషన్స్‌లో పాల్గొన్న తమన్నా, తన మిల్కీ బ్యూటీ ట్యాగ్, సినీ కెరీర్, పాత్రల ఎంపికపై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
“అందంగా ఉండటం వల్లే నాకు అవకాశాలు వచ్చాయంటారా? అలాంటి మాటలు అస్సలు నచ్చవు!” – అంటున్నది తమన్నా. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నా, గ్లామర్ ఒక్కటే సరిపోదని స్పష్టం చేసింది.
“ఒకవేళ అందం వల్ల డోర్ ఓపెన్ అయితే సరే… కానీ లోపల అడుగు పెట్టేది టాలెంట్‌తోనే!”
తన ‘మిల్కీ బ్యూటీ’ ట్యాగ్ గురించి మాట్లాడుతూ –
“అది నా ఫ్యాన్స్ ఇచ్చిన పేరు. నాకదేంటి అనిపించదు. కానీ నిజంగా నేనెవరంటే, నేను చేసిన పాత్రలే చెప్పాలి. అందంతో కాకుండా నటనతో గుర్తుండిపోవాలనేదే నా కోరిక.”
తమన్నా కెరీర్‌ని రివైండ్ చేస్తే –
ప్రతి దశలో విభిన్న పాత్రలు. వాణిజ్య చిత్రాలు అయినా, ప్రయోగాత్మక సినిమాలు అయినా, ఆమె ఎప్పుడూ తాను చేస్తున్న పాత్రపై ఫోకస్ పెట్టిందే. “ఒకే రకమైన క్యారెక్టర్స్ చెయ్యాలనే భయం ఎప్పుడూ నాకు లేదు. డిఫరెంట్ రోల్స్‌తోనే ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేయాలనిపిస్తుంది.”
“ఓదెల 2” లో శివశక్తిగా తమన్నా మరోసారి తన శక్తిని చూపించింది. మాస్ టచ్, ఇన్టెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆమె పాత్ర ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
మిల్కీ బ్యూటీ అనడం వారికి ఇష్టం అయి ఉండొచ్చు… కానీ తాను అసలు బ్యూటీని మించిపోయిన టాలెంట్.